16 డిఫెన్స్ మద్యం బాటిళ్ల పట్టివేత
01-11-2026 | 11:22pm
ఘట్ కేసర్, నవంబర్ 1 (విజయక్రాంతి): ఘట్ కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కీసరలో 16 డిఫెన్స్ మద్యం బాటిల్ల(Liquor Bottles)ను ఎక్సైజ్ పోలీస్ సిబ్బంది పట్టుకున్నారు. రోహిత్ (26) అనే వ్యక్తి ఈ మద్యం బాటిల్లను సప్లై చేస్తుండగా రాచర్ల సుబ్బారావు (57) అనే వ్యక్తి అమ్మకాలు జరుపుతున్నట్లుగా మల్కాజిగిరి ఎస్ఐ హనుమంతరావు తెలిపారు. నిందితుడిని మద్యం బాటిల్లను ఘట్ కేసర్ ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.