ప్రజల సమస్యలను పరిష్కరించండి
- ఎంఎంసీ కమిషనర్ కు వినతి పత్రం సమర్పణ.
- మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ మేయర్ మేకల కావ్య.
జవహర్ నగర్ అక్టోబర్ 16 ,(నినాదం): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని నాగారం, జవహర్ నగర్ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి(Medchal MLA and former minister Malla Reddy) పేర్కొన్నారు.
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్, నాగారం డివిజన్ల ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు సిసి రోడ్లు, పారిశుద్ధ్య తదితర మౌలిక సమస్యలను పరిష్కరించే దిశగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాజీ మేయర్ మేకల కావ్య బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కలిసి శుక్రవారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిసి పలు సమస్యలను వివరించి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా కమిషనర్ కు కాలనీలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా వివరించి వాటిని త్వరితంగా పరిష్కరించాలని కోరారు. దీనికి కమిషనర్ సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ, గరీబోళ్ళు ఎక్కువగా నివసిస్తున్న జవహర్ నగర్ ప్రాంతాన్ని అన్ని వైపులా అభివృద్ధి చేయాలని ముఖ్యంగా డ్రైనేజీ మంచినీరు, కరెంటు తదితర మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని తెలిపారు. నాగారం ప్రజలు ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్య విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఆలూరి సంగీత రాజశేఖర్, పల్లపు రవి, బండి నవీన్ గౌడ్ , బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.