అత్యంత వైభవంగా సద్దుల బతుకమ్మ సంబురాలు

16-10-2026 | 10:13pm

ఘట్ కేసర్, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణ ప్రజలు శుక్రవారం రాత్రి సద్దుల బతుకమ్మ పండగ(Saddula Bathukamma Festival) సంబురాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద మహిళలు బతుకమ్మ లను పెట్టి ఆటపాటలతో అలరించారు. సద్దుల బతు కమ్మ సందర్భంగా గురుకుల్ కళాశాల మైదానం వద్ద జనచైతన్య సేవా సమితి వ్యవస్థాపకులు, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్ ఆధ్వ ర్యంలో ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు.

విద్యుత్ లైటింగ్, డీజీఏ సౌండ్ సిస్టంలతో పాటు బతుకమ్మల నిమజ్జన ఏర్పాట్లను చేశారు. మహిళలు, యువతులు బతుకమ్మలతో పెద్దసంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ ఆట పాటలతో హోరెత్తించారు. ఈవేడుకలకు ముఖ్య అతిథులుగా ఆయా రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అతిథులను మాజీ సర్పంచ్ యాదగిరి యాదవ్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. గ్రామపెద్దలు పాల్గొని ఈబతుకమ్మ సంబరాలను తిలకించారు. అలాగే పట్టణం లోని పలుచోట్ల బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు