మల్టిపుల్ మహాధర్నను జయప్రదం చేయాలి

25-10-2026 | 06:47pm

ఘట్ కేసర్, అక్టోబర్ 25 (విజయక్రాంతి) : తెలంగాణ మున్సిపల్ వర్కర్స్(Telangana Municipal Workers) , ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఈనెల 26న చలో హైదరాబాదు మల్టిపుల్(Chalo Hyderabad Multiple) మహాధర్నను జయప్రదం చేయాలని ఆదివారం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు(CITU) జిల్లా నాయకులు చింతల యాదయ్య, ఎన్. సబిత మాట్లాడుతూ ఈనెల అక్టోబర్ 26న జరిగే మల్టిపుల్ మహాధర్నను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

మున్సిపల్ సిబ్బందిని(Municipal staff) పర్మెంటు చేయాలని, 2వ  పి ఆర్ సి ని ప్రకటించాలని, కనీస వేతనం రూ.30వేలుగా నిర్ణయించాలని, డిఏ వర్తింపచేయాలని, వయసు పైబడిన ఆరోగ్యం పాలైన మరణించిన మున్సిపల్ కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ రేపు 26న చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చిందని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో   యాదమ్మ, జంగమ్మ, కృష్ణ, నరేష్ , పద్మ , సుజాత, ఎల్లమ్మ , జంగయ్య,  లక్ష్మణ్,  అశోక్, చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు