బిజిలీగా రుహానీ శర్మ

25-10-2026 | 05:20am

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’(Akashamlo Oka Tara). గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో ముఖ్యమైన పాత్రను మేకర్స్ పరిచయం చేశారు.

ఈ సినిమాలో బిజిలీగా నటిస్తున్న రుహానీ శర్మ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. కిటికీ పక్కన కూర్చుని కనిపిస్తున్న ఆమె సంప్రదాయ దుస్తుల్లో, అందంగా ఆకట్టుకున్నారు. బిజిలీ పాత్ర సినిమాలో ఎలాంటి మలుపులు తీసుకొస్తుందనే ఆసక్తిని ఈ ఫస్ట్ లుక్ పెంచుతోంది. అనుకోని సమయంలో కథలోకి ప్రవేశించి, అప్పటివరకు సాగుతున్న ప్రయాణానికి కొత్త వెలుగును తీసుకొచ్చే పాత్రగా బిజిలీని మేకర్స్ పరిచయం చేశారు. 

అనుకోకుండా ఎదురయ్యే ఓ పరిచయం.. ఆ ప్రయాణంలో ఊహించని అందమైన అనుభూతులను తీసుకొస్తుంది. ఈ చిత్రానికి సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్వేత సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. నవంబర్ 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

మరిన్ని వార్తలు