కనకరాజ్ డైరెక్షన్‌లో అల్లు మూవీ ఎఎ-23

13-10-2026 | 05:05am

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) హీరోగా స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) తెరకెక్కించనున్న చిత్రం ‘ఎఎ-23(AA-23)’. ఈ మూవీ ప్రకటనతో ఇటీవల సోషల్ మీడియాలో భారీ సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్(Project Announcement) వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా రాబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) కంపోజ్ చేసిన సాంగ్ విడుదలైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అభిమానులు, సినీ ప్రియుల మధ్య ఈ పాట హాట్ టాపిక్‌గా నిలిచింది. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్, అనిరుధ్ వంటి స్టార్స్ వర్క్ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని విశేషాలు ఎప్పుడు వెల్లడవుతాయా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాకు సంబంధించి ఓ స్పెషల్ అప్‌డేట్‌ను షేర్ చేసి సినిమాపై ఆసక్తిని మరింత పెంచారు.

ఈ చిత్రంలో లోకేష్ అల్లు అర్జున్‌కు ఏదో వివరిస్తూ కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, అల్లుకు అత్యంత సన్నిహితులైన బన్నీవాస్, సందీప్ రామినేని, నటరాజ్, స్వాతి సహ నిర్మాతలుగా ఈ చిత్ర నిర్మాణంలో భాగమయ్యారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన ప్రకటనలు వచ్చే అవకాశం ఉండటంతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు