‘డీజే టిల్లు’లా సర్‌ప్రైజ్ చేసే ‘అనుమాన పక్షి’
‘డీజే టిల్లు(DJ Tillu)’తో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన విమల్ కృష్ణ (Vimal Krishna)మరో క్విర్కీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ(Quirky entertainment movie)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజాచిత్రం ‘అనుమాన పక్షి(Suspicious Bird)’. రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను చిలక ప్రొడక్షన్స్ సమర్పణలో రాజీవ్ చిలక, రాజేశ్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానున్న సందర్భంగా మేకర్స్ బుధవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో హీరో రాగ్ మయూర్ మాట్లాడుతూ.. “నటుడిగా ప్రతిక్షణం మెరుగవడానికి ప్రయత్నించా. యాక్టింగ్ నా ఊపిరి. ఇప్పుడు ‘అనుమాన పక్షి’తో హీరోగా వస్తున్నా.
ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ విమల్ కృష్ణ ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్‌ను తెలుగు సినిమాలో ప్రేక్షకులు చూసి ఉండరు” అన్నారు. ‘ఈ సినిమాలో కన్యా క్యారెక్టర్ చేయడం చాలా ఎంజాయ్ చేశా. తప్పకుండా ఈ సినిమా అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తుంద’ని హీరోయిన్ మెరీన్ చెప్పింది. డైరెక్టర్ విమల్ కృష్ణ మాట్లాడుతూ.. “ఈ సినిమా మీద నేను చాలా నమ్మకంగా ఉన్నా. 100% కొడుతున్నాం.
‘డీజే టిల్లు’లాగే ఈ సినిమా ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తుంది. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుంది” అని తెలిపారు. నిర్మాత రాజీవ్ చిలక మాట్లాడుతూ.. “ఇది స్టోరీ, కథనం, ప్రెజెంటేషన్‌లో డిఫరెంట్‌గా ఉండే సినిమా. చాలా యూనిక్ ఫిల్మ్. చాలా ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా. యూత్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు” అని తెలిపారు. ప్రొడ్యూసర్ మేఘా, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్, ఎడిటర్ చోటా ప్రసాద్ కూడా మాట్లాడారు. సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.