మండాడి టీమ్‌కు కమల్‌హాసన్ అభినందనలు

24-09-2026 | 05:45am

ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌(RS Infotainment banner)పై దర్శకుడు మతిమారన్(Director Mathimaran) పుగళేంది తెరకెక్కించిన ‘మండాడి’ చిత్రం(Mandadi Movie) ప్రేక్షకాదరణను దక్కించుకుంది. ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో సూరి, సుహాస్(Suhas), మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ కీలక పాత్రలను పోషించారు. తెలంగాణ, ఏపీలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పీపై సెప్టెంబర్ 10న రిలీజ్ చేశారు. ఇప్పటికే వంద కోట్ల క్లబ్బులో చేరిన ఈ సినమా ఇంకా థియేటర్లలో సందడి చేస్తోంది.

ఈ సందర్భంగా ఈ మూవీ టీమ్‌కు ఇప్పటికే రజినీకాంత్ అభినందనలు తెలియజేశారు. తాజాగా కమల్ హాసన్ కూడా ఈ చిత్రబృందాన్ని అభినందించారు. ఈ విషయాన్ని హీరో సూరి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘నా జీవితంలో మర్చిపోలేని ఓ ఘటన. ఈ రోజుని ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మా ‘మండాడి’ టీమ్ మీద డా. కమల్ హాసన్ సర్ కురిపించిన ప్రేమ, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం, చెప్పిన మాటలు మాకు ఎంతో ప్రత్యేకం..’ అంటూ సూరి పోస్ట్ చేశారు. 

మరిన్ని వార్తలు