ఈ ఆదివారం బ్యాంకులు ఓపెన్

24-09-2026 | 05:05am
  1. ఈ నెల 28 నుంచి 30 వరకు యూఎఫ్‌బీయూ దేశవ్యాప్త సమ్మె
  2. వారానికి 5 రోజుల వర్క్‌కు బ్యాంక్ సంఘాల డిమాండ్
  3. పౌరుల బ్యాంకింగ్ సేవల కోసం కేంద్రం ముందస్తు చర్యలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(United Forum of Bank Unions) (యూఎఫ్‌బీయూ) ఈ నెల 28 నుంచి 30 వరకు దేశవ్యాప్త సమ్మె(Nationwide strike)కు పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వినియోగదారుల సౌకర్యార్థం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహా అన్ని బ్యాంకులు ఈ ఆదివారం పనిచేస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ(Ministry of Finance) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఆయా బ్యాంకులు తమతమ వినియోగదా రులకు ముందస్తు మెస్సేజ్‌లు, ఈమెయిల్, వాట్సప్‌ల ద్వారా అలర్ట్ చేశాయి.

బ్యాంకింగ్ రంగ ఉద్యోగుల(Banking sector employees)లో 90 శాతం మందికి ప్రాతినిథ్యం వహిస్తున్న యూఎఫ్‌బీయూ, ప్రధానంగా వారానికి 5 రోజుల పని విధానం సహా ఇతర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు దిగనుంది. అయితే ఈ సమ్మె గనుక జరిగితే, అది బ్యాంకింగ్ రంగం అర్ధ-వార్షిక ముగింపుపై ప్రభావం పడనుంది. అలాగే ఈ నెల 26, 27 తేదీలలో వారాంతపు సెలవుల ఉన్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు యూఎఫ్‌బీయూ పిలుపుని చ్చిన మూడు రోజుల దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె నిర్వహించనుంది.

దీంతో పౌరుల బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం(Central Government) ముందస్తు చర్యలు తీసుకుందని ఆ ప్రకటన పేర్కొంది. ప్రజల బ్యాంకింగ్ అవసరాలపై ప్రభావం పడకుండా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులతో సహా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈ నెల 27న సాధారణంగా పనిచేస్తాయని స్పష్టం చేసింది. ఈ ఆదివారం అన్ని బ్యాంక్ శాఖలు, కార్యాలయాలు, ఏటీఎంల -అనుసంధాన శాఖలు, కరెన్సీ చెస్ట్‌లు పూర్తిగా పనిచేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతినిచ్చిందని పేర్కొంది.

బ్యాంక్ వినియోగదారుల సంక్షేమం, సౌకర్యమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం మరోసారి స్పష్టం చేసింది. ప్రతిపాదిత సమ్మెను వాయిదా వేయాలని ప్రభుత్వం, బ్యాంక్ యాజమా న్యాలు యూనియన్లకు విజ్ఞప్తి చేశాయని, అలాగే అత్యవసర బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా కొనసాగేలా చర్యలు తీసుకున్నాయని తెలిపింది. యూఎఫ్‌బీయూ ఇతర డిమాండ్లలో పెన్షన్ పెంపు, సవరణ, పెన్షనర్లందరికీ ఒకే విధమైన కరువు భత్యం (డీఏ) విధానం, నేష నల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) పరిధిలోని ఉద్యోగులకు పాత పెన్షన్ విధానానికి (ఏపీఎస్) మారే అవకాశం కల్పించడం వంటివి ఉన్నా యి.

సమ్మె గనుక జరిగితే, తమ బ్యాంకింగ్ అవసరాల కోసం మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, బీసీ పాయింట్, యూపీఐ వంటి డిజిటల్ మాధ్యమాలను ఉపయోగించుకోవాలని తమ వినియోగదారులకు అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు మెసేజ్‌లు, వాట్సప్‌లు, ఈమెయిల్‌లలో సూచనలు జారీ చేశాయి. ఎలాంటి అసౌకర్యానికి గుకికారుండా ప్రతిపాదిత సమ్మె తేదీలకు చాలా ముందుగా నే అవసరమైన బ్యాంకింగ్ లావాదేవీలను పూర్తి చేసుకోవాలని సలహా ఇచ్చాయి. అయితే ప్రతిపాదిత 3 రోజుల సమ్మె ప్రభాఉవం ఈ నెల 30న ఉన్న బ్యాంకుల అర్ధవార్షిక ముగింపుపై కూడా పడనుంది. ఆ రోజు రికన్సిలియేషన్, ప్రొవిజనింగ్, ట్రెజరీ, మార్కెట్ కార్యకలాపాల కు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది.

మరిన్ని వార్తలు