ప్రతి ఒక్కరికీ ఆయుష్మాన్ భరోసా

24-09-2026 | 05:05am
  1. దేశంలో 60 కోట్లకు పైగా లబ్ధిదారులకు ప్రయోజనం
  2. ఏడాదికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా రక్షణ
  3. ప్రజల ఆరోగ్యం, బలమైన భారతే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం
  4. ఆయుష్మాన్ భారత్ పథకం ఎనిమిదేళ్లు పూర్తిపై బీజేపీ హర్షం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: దేశంలో ప్రతి ఒక్కరికీ ఆయుష్మాన్ భారత్ పథకం(Ayushman Bharat Scheme) ఆరోగ్య భరోసా(Health Assurance) ఇస్తూ, ప్రజల ఆరోగ్యం, బలమైన భారతే లక్ష్యంగా మోదీ(Narendra Modi) ప్రభుత్వం కృషిచేస్తోంది. ఈ పథకం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకోవడంతో బీజేపీ బుధవారం హర్షం వ్యక్తం చేసింది. దేశం లోని మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 60 కోట్లకుపైగా లబ్ధిదారులు(Beneficiaries) ఏడాదికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా రక్షణను పొందుతున్నారని పార్టీ పేర్కొంది.

ద్వితీయ, తృతీయ స్థాయి వైద్య సేవల(Medical services) కోసం కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు నగదు రహిత ఆసుపత్రి చికిత్స సదుపాయాన్ని కల్పించే లక్ష్యంతో ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన(Ayushman Bharat Prime Minister Jan Arogya Yojana) (ఏబీపీఎంజేఏవై) పథకం సెప్టెంబర్ 23, 2018న ప్రారంభమైంది. సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్’లు, అలాగే ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’, ‘ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్’ వంటివి కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రారంభమైన ఈ పథకం, దేశవ్యా ప్తంగా పౌరులకు ఆరోగ్య సంరక్షణ భద్రతను మరింత అందుబాటులోకి తీసుకురావడంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఎక్స్‌లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 1.86 లక్షలకు పైగా ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్’ల ద్వారా 500 కోట్లకు పైగా ఆరోగ్య సంరక్షణ సందర్శనలు (వైద్య సేవలు) ప్రజలకు మరింత చేరువయ్యాయని ఆయన తెలిపారు.

రోగ్యవంతమైన పౌరులు, బలమైన భారత్ అనే లక్ష్యంతో ఆయుష్మాన్ భారత్ ముందుకు సాగుతోంది స్పష్టం చేశారు. ఈ పథకం కింద లబ్ధిదారులు రూ.5 లక్షల వరకు చికిత్స కోసం ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ తెలిపారు. ఈ పథకం కింద 13 కోట్లకు పైగా ఆసుపత్రి అడ్మిషన్లు జరిగాయని, ఈ సంఖ్య ‘ప్రపంచంలోనే అత్యధికం‘ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఈ పథకం కింద రూ.2 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశారని, క్షేత్రస్థాయిలో మోదీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల ప్రభావాన్ని ఇది తెలియజేస్తోందని స్పష్టం చేశారు. కోట్లాది మంది పేద, అవసరంలో ఉన్న కుటుంబాలకు వైద్య అత్యవసర సమయాల్లో ఆర్థిక భద్రత కల్పించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించిందని బీజేపీ రాజ్యసభ ఎంపీ తరుణ్ చుగ్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు