క్రేజీ కల్యాణం.. రెండు వారాల ముందే!
నరేశ్ వీకే(Naresh VK), అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswara), తరుణ్ భాస్కర్, ‘రాజు వెడ్స్ రాంబాయి(Raju Weds Rambai)’ ఫేమ్ అఖిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘క్రేజీ కల్యాణం(Crazy Wedding)’. భద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్‌మోహన్‌రెడ్డి నిర్మిస్తు న్నారు. ఈ సినిమా ఈ నెలాఖరున అంటే అక్టోబర్ 30న విడుదల కావాల్సిన ఈ సినిమా రెండు వారాల ముందే ఈ నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు.
ఇవి కూడా చదవండి: స్టార్ కపుల్ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్
ఇప్పటికే ప్రమోష నల్ కంటెంట్‌తో మూవీ లవర్స్‌ను బాగా ఆకర్షించిందీ చిత్రం. ముఖ్యంగా సాంగ్స్ చాట్‌బస్టర్స్ అయ్యాయి. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రానికి డీవోపీ: శ్యామ్ దూపాటి; సంగీతం: సురేశ్ బొబ్బిలి; లిరిక్స్: గోరటి వెంకన్న, చైతన్యప్రసాద్, కాసర్ల శ్యామ్; యాక్షన్: డ్రాగన్ ప్రకాశ్; ఎడిటర్: శ్రావణ్ కటికనేని; ఆర్ట్: సాయి కదిర.