రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ

07-10-2026 | 01:15pm

కల్వకుర్తి, అక్టోబర్ 7: ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్లిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎల్లికల్ గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి శేఖర్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి మహబూబ్‌నగర్‌కు వెళ్లాడు.

బుధవారం ఉదయం తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండటాన్ని గుర్తించాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా 12 తులాల బంగారు ఆభరణాలు(Gold Ornaments), రూ.1.50 లక్షల నగదు(Cash) కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు(Clues) సేకరించి, చోరీ జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు(Investigation) చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు