ఓటీటీలోకి ‘మారెమ్మ’

07-10-2026 | 12:00pm

దున్నపోతు మిస్సింగ్ మిస్టరీ ఏంటో తెలుసా?

థియేటర్లలో సందడి చేసిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘మారెమ్మ’(Maremma OTT Release) ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. మయూర్ రెడ్డి బండారు నిర్మించిన ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహించారు. పల్లెటూరి వాతావరణం, యాక్షన్ అంశాలు, సస్పెన్స్‌ను కలిపి రూపొందించిన Telugu Suspense Thrillerగా ‘మారెమ్మ’ తెరకెక్కింది. రవితేజ సోదరుడి కుమారుడు మాధవ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం కాగా.. ‘హార్ట్‌బీట్’ ఫేమ్ దీపాబాలు కథానాయికగా నటించింది.

ఇవి కూడా చదవండి: ఆమెతో జోడీ ప్రతిసారీ ప్రత్యేకమే

సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలైన ఈ Maremma Movie ఇప్పుడు ఈ నెల 9 నుంచి ఆహా OTTలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఒక అందమైన పల్లెటూరిలో గ్రామదేవత మారెమ్మ తల్లిని స్థానికులు ఇలవేల్పుగా పూజిస్తుంటారు. అమ్మవారికి సమర్పించిన దున్నపోతు ‘మారి’ని కర్ణి సంరక్షిస్తుంటాడు. అయితే ఓ రోజు ఆ దున్నపోతు అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. అసలు ‘మారి’ ఎక్కడికి వెళ్లింది? దాని అదృశ్యం వెనుక కారణమేంటి? దాన్ని వెతికే క్రమంలో కర్ణికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనే ప్రశ్నల చుట్టూ Maremma OTT Release కథనం సాగుతుంది. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని వార్తలు