వర్కౌట్ టైమ్‌లో ప్రగ్యా.. ఫొటోలు వైరల్!

07-10-2026 | 01:21pm

టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) సోషల్ మీడియాలో మరోసారి సందడి చేసింది. ఎప్పటికప్పుడు తన ఫ్యాషన్, ఫిట్‌నెస్ అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకునే ఈ భామ.. తాజాగా జిమ్‌లో దిగిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

వర్కౌట్ సెషన్‌లో స్పోర్టీ లుక్‌లో కనిపించిన ప్రగ్యా.. ఫొటోల్లో తన స్టైలిష్ అవతార్‌తో ఆకట్టుకుంది. జిమ్‌లోని మిర్రర్ సెల్ఫీలతో పాటు వర్కౌట్ మోడ్‌ను చూపించే పిక్స్‌ను ఆమె అభిమానులతో పంచుకుంది. “So good to be back” అంటూ పెట్టిన ఆమె పోస్ట్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది.

ఫిట్‌నెస్‌పై ఆసక్తి చూపించే ప్రగ్యా జైస్వాల్ గతంలోనూ తన వర్కౌట్ రొటీన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ఆమె తాజా జిమ్ పిక్స్ కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన ఈ లేటెస్ట్ జిమ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని వార్తలు