సిటిజన్‌షిప్‌కు ఎసరు
వాషింగ్టన్: అమెరికాలో Citizenship Revocation, Denaturalization ప్రక్రియ మరోసారి చర్చనీయాంశంగా మారింది. తప్పుడు సమాచారం, మోసం లేదా కీలకమైన విషయాలను దాచిపెట్టి అమెరికా పౌరసత్వం పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మంది సహజీకృత పౌరులపై పౌరసత్వం రద్దు(US Citizenship Revocation) చేసేందుకు అమెరికా న్యాయశాఖ కోర్టులను ఆశ్రయించింది. ఆగస్టు 21 నుంచి అక్టోబర్ 2 మధ్య 19 ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టుల్లో ఈ కేసులు దాఖలయ్యాయి. అమెరికా న్యాయశాఖ ప్రకారం, ప్రస్తుత ట్రంప్ పరిపాలనలో ఒకే సమయంలో నమోదైన అతిపెద్ద డీ-న్యాచురలైజేషన్ కేసుల సమూహం ఇదే.
ఈ జాబితాలో భారతీయుడైన బల్విందర్ సింగ్(Balwinder Singh US Citizenship) పేరు కూడా ఉంది. అమెరికా అధికారుల ఆరోపణల ప్రకారం.. ఆయన వేర్వేరు గుర్తింపులతో ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలు పొందినట్లు కేసు నమోదైంది. 1992లో ఒక గుర్తింపుతో ఇమ్మిగ్రేషన్ దరఖాస్తు చేసుకున్న ఆయన, 2003లో మరో గుర్తింపుతో శాశ్వత నివాస హోదా పొందారని, 2009లో అదే రెండో గుర్తింపుతో అమెరికా పౌరసత్వం పొందారని న్యాయశాఖ పేర్కొంది. రెండు దరఖాస్తుల్లోని వేలిముద్రలు ఒకే వ్యక్తికి చెందినవని అధికారులు గుర్తించినట్లు తెలిపింది.
ఈ 40 కేసుల్లో వివిధ దేశాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. గూఢచర్యం, హత్య, లైంగిక నేరాలు, మనీ లాండరింగ్, పన్ను ఎగవేత, వివాహ మోసం, తప్పుడు గుర్తింపులు వంటి తీవ్రమైన ఆరోపణలు కొన్ని కేసుల్లో ఉన్నాయి. అమెరికా అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్ ప్రకారం.. చట్టవిరుద్ధంగా లేదా మోసపూరితంగా పొందిన పౌరసత్వాన్ని ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు.
అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే.. ఈ 40 మందికి పౌరసత్వం ఇప్పటికే రద్దు కాలేదు. వారి సహజీకృత పౌరసత్వాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం కోర్టుల్లో కేసులు వేసింది. సంబంధిత ఆరోపణలు కోర్టులో రుజువైతేనే Naturalized U.S. Citizenship Revocationకు దారి తీస్తుంది. అమెరికా Immigration and Nationality Act ప్రకారం మోసం లేదా కీలక సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి పౌరసత్వం పొందినట్లు నిర్ధారణ అయితే సహజీకృత పౌరసత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంది.