స్టార్ కపుల్ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్
ముంబై: బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా(Kiara Advani Pregnancy) అద్వానీ–సిద్ధార్థ్ మల్హోత్రా మరోసారి పేరెంట్స్ కాబోతున్నట్లు సోషల్ మీడియా(Social Media) వేదికగా ప్రకటించారు. తమ కుమార్తె సారాయాతో కలిసి ఈ గుడ్ న్యూస్‌ను అభిమానులతో పంచుకున్నారు. ప్రేమ, ఆనందంతో తమ హృదయాలు నిండిపోయాయని కియారా పేర్కొంది. ఈ సందర్భంగా ముగ్గురూ కలిసి చిన్నారుల కోసం ఉపయోగించే కొత్తగా అల్లిన బేబీ బూటీస్‌ను చేతుల్లో పట్టుకున్న ఫొటోను షేర్ చేశారు. దీంతో Kiara Advani Pregnancy News, Sidharth Malhotra Baby News సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి: క్రేజీ కల్యాణం.. రెండు వారాల ముందే!
గత ఏడాది నవంబర్‌లో కియారా–సిద్ధార్థ్(Kiara–Sidharth) దంపతులకు సారాయా జన్మించింది. తల్లిగా మారిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని కియారా గతంలో పలు సందర్భాల్లో చెప్పింది. మరోవైపు Toxic సినిమాలో గర్భవతిగా ఉన్న సమయంలోనూ కష్టమైన సన్నివేశాల్లో నటించిందని సహనటి హుమా ఖురేషి ఇటీవల గుర్తుచేసుకుంది. కియారా, సిద్ధార్థ్ 2021లో వచ్చిన Shershaah సినిమా సమయంలో దగ్గరయ్యారని, ఆ తర్వాత 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లో వివాహం చేసుకున్నారని సమాచారం. ఇప్పుడు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారనే ప్రకటనతో ఈ స్టార్ కపుల్ అభిమానుల్లో ఆనందం నెలకొంది.