ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్

07-10-2026 | 01:21pm

ఎయిర్‌టెల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. గుడ్ న్యూస్ కూడా!

ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్(Airtel Postpaid Plans) వినియోగదారులకు కొత్త రేట్లను తీసుకొచ్చింది. ఎంపిక చేసిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలను సుమారు 3 శాతం నుంచి 10 శాతం వరకు పెంచినట్లు సంస్థ ప్రకటించింది. సవరించిన టారిఫ్‌లు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో Airtel Postpaid Plans, Airtel Postpaid Recharge, Airtel New Tariff కోసం చూస్తున్న కస్టమర్లు కొత్త ధరలను గమనించాల్సి ఉంటుంది.

అయితే ధరల పెంపుతో పాటు ఎయిర్‌టెల్ మరో ప్రయోజనాన్ని కూడా జోడించింది. సవరించిన ప్లాన్లలో ప్రతి సిమ్‌కు ఏడాదికి ఒకసారి ఉచిత International Roaming Benefit అందించనున్నట్లు తెలిపింది. ఇందులో 5 రోజుల వ్యాలిడిటీతో 5GB డేటా, 60 నిమిషాల కాలింగ్, 25 అవుట్‌గోయింగ్ SMSలు, ఉచిత ఇన్‌కమింగ్ SMSలు ఉంటాయి. ముఖ్యంగా విదేశాలకు తరచూ వెళ్లే వారికి ఈ Airtel Free International Roaming ప్రయోజనం ఉపయోగపడనుంది.

ధరల మార్పులో భాగంగా వ్యక్తిగత కనెక్షన్‌కు సంబంధించిన రూ.449 ప్లాన్ రూ.499కి చేరింది. రెండు సిమ్‌ల ఫ్యామిలీ ప్లాన్ రూ.699 నుంచి రూ.749కి, మూడు సిమ్‌ల ప్లాన్ రూ.999 నుంచి రూ.1,049కి పెరిగింది. నాలుగు సిమ్‌ల కోసం రూ.1,249, రూ.1,449 ప్లాన్లు ఉండగా.. ఐదు సిమ్‌లతో పాటు Netflix Standard సబ్‌స్క్రిప్షన్ అందించే ప్లాన్ ధర రూ.1,799గా నిర్ణయించారు. కొత్త పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లతో పాటు ఇప్పటికే ఉన్న కస్టమర్లు కూడా అర్హత మేరకు కొత్త ప్లాన్లకు మారే అవకాశం ఉందని సంస్థ తెలిపింది.

ఎయిర్‌టెల్ ప్రకారం.. కస్టమర్లకు మెరుగైన 5G Network Experience, Unlimited Data, Unlimited Calling, Spam Protectionతో పాటు అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో అదనపు కనెక్టివిటీ సౌకర్యం అందించడమే తాజా మార్పుల ఉద్దేశ్యం. ప్రస్తుతం ఎయిర్‌టెల్ అధికారిక పోస్ట్‌పెయిడ్ పేజీలో 5G, OTT వంటి ప్రయోజనాలతో పలు పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వార్తలు