ఎడిట్ చేయని వీడియో ఇవ్వాలి: కౌశిక్‌రెడ్డి

07-10-2026 | 12:31pm

హైదరాబాద్: ఎథిక్స్ కమిటీ(Ethics Committee)కి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన వివరణను సమర్పించారు. సభలో కడియం శ్రీహరిని బెదిరించేలా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు.అక్రమ మైనింగ్, భూకబ్జాలపై చర్చ సందర్భంగా సభలో తీవ్ర వాగ్వాదం జరిగిందని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. కడియం శ్రీహరి సైగలు చేస్తూ తనను దూషించారని ఆరోపించారు. తనపై ఇచ్చిన వీడియో క్లిప్‌లో(Video Clip) పూర్తి ఘటన లేదని, ఎడిట్ చేయని పూర్తి వీడియోను కమిటీకి అందించాలని కోరారు.

తనపై ఆరోపణలు చేసిన సభ్యులను వ్యక్తిగతంగా విచారించే అవకాశం కల్పించాలని కౌశిక్ రెడ్డి కోరారు. అలాగే న్యాయవాదితో కమిటీ ఎదుట హాజరయ్యే హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వీడియో(FULL Video) ఆధారంగా ఘటనను పరిశీలించి, తన వాదనను పరిగణనలోకి తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు