కరికాల చందమామ లాంటి అందమైన కథ

16-10-2026 | 05:05am

సందీప్ కిషన్(Sundeep Kishan) హీరో గా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్‌రెడ్డి, రాజశేఖర్ అన్న భీమోజు నిర్మాణంలో యుగం ధర్ ముని తెరకెక్కిస్తున్న చిత్రం ‘కరికాల(Karikala)’. రెండు భాగాలుగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్ర మొదటి చాప్టర్‌ను 2027 జూలై 2న, రెండో చాప్టర్‌ను 2027 అక్టోబర్ 28న విడుదల చేయనుట్టుగా మేకర్స్ ప్రక టించిన సంగతి తెలిసిందే. అయితే గురువారం ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరి గాయి. ముగ్గురు కథానాయి కలు కేథరిన్ థ్రెసా, గాయత్రి భరద్వాజ్, సాక్షి మడోల్కర్ ఈ కార్యక్రమంలో సందడి చేశారు.

ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజశేఖర్ తల్లి సత్యవతి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మహిధర్ తల్లి పద్మారెడ్డి క్లాప్ కొట్టారు. తొలి సన్నివేశానికి ఆదిసాయి కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత రాజశేఖర్ తండ్రి వీరభద్రాచారి స్క్రిప్టును అందజేశారు. ‘కరి కాల’ తన కెరీర్ బెస్ట్ అవుతుందని ఈ సందర్భంగా సందీప్ కిషన్ చెప్పారు. కేథరిన్ థ్రెసా మాట్లాడుతూ.. “చాలా రోజుల తర్వాత ఓ సినిమా గురించి, నా పాత్ర గురించి ఎంతో ఆసక్తిగా ఎదుచేస్తున్నా” అని చెప్పింది.

గాయత్రి భరద్వాజ్ మాట్లాడుతూ.. “కరికాల’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు అద్భుతంగా జరుగుతున్నాయి. వర్త్ వాచ్ అనేలా ఉంటూ,  అందమైన మాయాలోకాన్ని చూపిస్తుందీ సినిమా” అని తెలిపింది. సాక్షి మడోల్కర్ మాట్లాడుతూ.. “కరికాల’ ప్రపంచం నాకెంతో నచ్చింది. ఇందులోని మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది” అని చెప్పింది. దర్శకుడు యుగంధర్ మాట్లాడుతూ.. “అందమైన చందమామ కథలా ఈ చిత్రం ఉంటుంది. అందమైన ఊహా ప్రపంచం, నాగలోకం, వానర లోకం అని ఇలా ఓ ప్రపంచాన్ని సృష్టించబోతోన్నాం” అని తెలిపారు. ‘వచ్చే వారం నుంచి మూవీ షూటింగ్‌ను ప్రారంభిస్తున్నామ’ని నిర్మాత రాజశేఖర్ వెల్లడించారు. సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, ఇతర చిత్రబృందం కూడా ఈ వేడుకలో మాట్లాడారు. 


మరిన్ని వార్తలు