నిజాం పాలనను ఎదిరించిన వీరుడు..పండుగ సాయన్న

22-10-2026 | 12:33pm

తాడ్వాయి, అక్టోబర్ 22 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో గురువారం పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 

ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు, ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడిన తెలంగాణ ముదిరాజ్ పులిబిడ్డ పండుగ సాయన్న అని కొనియాడారు. తెలంగాణలోని పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు సాయన్న అని పేర్కొన్నారు. సాయన్న 174వ జయంతి (Birth Anniversary) వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు సాయిలు, తిరుపతి, భూపతి, నారాయణ, మల్లయ్య, శంకర్, రవి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సాయన్న సేవలను స్మరించుకుంటూ జయంతి వేడుకలను (Celebrations) నిర్వహించారు.

మరిన్ని వార్తలు