ముందస్తు బతుకమ్మ సంబరాలు
వెంకటాపురం జడ్ పిఎస్ఎస్ స్కూల్
రంగురంగుల పూలతో బతుకమ్మలు.
విద్యార్థినుల ఆటపాటలతో సందడి.
వెంకటాపురం నూగూరు, అక్టోబర్ 9 విజయక్రాంతి : వెంకటాపురం మండల జెడ్ పి ఎస్ ఎస్ స్కూల్లో(Venkatapuram Mandal ZPSS School) శుక్రవారం ముందస్తు బతుకమ్మ ఉత్సవాలను(Bathukamma festivities) ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రంగురంగుల పూలను సేకరించి బతుకమ్మలను పేర్చారు. అనంతరం ఉపాధ్యాయులతో కలిసి ఆటపాటలతో బతుకమ్మ లతో సందడి చేస్తూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ విశిష్టతను, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో దాని ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.