ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు

09-10-2026 | 08:41pm

గణపురం, అక్టోబర్ 09 (విజయక్రాంతి): గణపురం మండలం(Ganapuram Mandal) చెల్పూర్‌లోని ఎంజీఎం పాఠశాలలో(MGM School) శుక్రవారం ముందస్తు బతుకమ్మ వేడుకలను(Bathukamma celebrations) ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి, ఉపాధ్యాయులతో(Teachers') కలిసి పాటలు, కోలాటాలతో సందడి చేశారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గ్యాదంగి సతీష్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ప్రకృతిని, పూలను ఆరాధించే విశిష్టమైన పండుగ అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు గ్యాదంగి తిరుపతి, సిలివేరి శ్రీనివాస్, గ్యాదంగి రమాదేవి, ప్రిన్సిపాల్ మధుకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు