పది రోజులుగా మూతపడ్డ రైస్ మిల్లులు

20-09-2026 | 01:01pm

నిరవధిక సమ్మెతో రైస్ మిల్లుల మూత 

రోడ్డున పడ్డ కార్మికులు

ములుగు,సెప్టెంబర్ 20(విజయ క్రాంతి): సమస్యల పరిష్కారం కోసం.. తమ న్యాయమైన కోరికల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 10 నుండి రైస్ మిల్లులు(Rice Mills) నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 42 మిల్లులు(Mills) ఉండగా అందులో 9 బాయిల్డ్ రైస్ మిల్లులు, 33 రా రైస్ మిల్లులు ఉన్నాయి. కాగా ఒక్కో రైస్ మిల్లులో 25 నుండి 40 మంది వరకు హమాలీలు, గుమస్తాలు, ఇతర దినసరి కార్మికులు పనిచేస్తారు.

అయితే గత పది రోజులుగా రైస్ మిల్లుల నిలవధిక సమ్మెతో వీరందరూ రోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొంది. రైస్ మిల్లులకు సంబంధించిన ప్రధాన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని, మిల్లర్ల న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రైస్ మిల్లుల నిరవధిక సమ్మెతో నేటికీ పది రోజులు కావస్తుండగా కార్మికుల దుస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం స్పందించి సకాలంలో రైస్ మిల్లుల సమస్యకు పరిష్కారం చూపకపోతే కార్మికుల కుటుంబాలు దీనస్థితికి చేరే ప్రమాదం ఉంది.

మరిన్ని వార్తలు