ప్రమాద బాధితులకు భరోసా.. కలెక్టర్ ఆదేశాలు
నాగర్కర్నూల్ (విజయక్రాంతి): రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో మెరుగైన వైద్యం (Quality Treatment) అందించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ వైద్య, పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి పీఎం రాహత్ పథకం (PM Rahat Scheme) అమలును పరిశీలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లోనే ప్రథమ సమాచార నివేదిక (FIR) నమోదు చేసి, బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాలని ఆదేశించారు. చికిత్సకు అయ్యే అదనపు ఖర్చులను ఆరోగ్యశ్రీ పథకం (Aarogyasri Scheme) ద్వారా భరించే అవకాశం ఉందని వివరించారు.ఈ పర్యటనలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుప్రియ తదితరులు పాల్గొన్నారు