ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల భిక్షాటన.!

17-10-2026 | 08:28pm

నాగర్‌ కర్నూల్ (విజయక్రాంతి): ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల(NHM employees) నిరవధిక సమ్మె శనివారం ఐదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులు కొల్లాపూర్ ఎక్స్‌రోడ్‌లో(Kollapur Crossroad) భిక్షాటన ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 78 క్యాడర్లలో పనిచేస్తున్న సుమారు 17 వేల మంది ఉద్యోగులను షరతులు లేకుండా రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగ భద్రత(Job security) కల్పించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌస్ పాషా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు