ఎల్ ని నో ప్రభావం పై జ్యోతిబాపూలే విద్యార్థుల ప్రదర్శన
బెజ్జూర్, నవంబర్ 2 (విజయ క్రాంతి ): ఎల్ ని నో ప్రభావంతో(El Niño effect) మారిన వాతావరణ పరిస్థితులకు రాబోయే రోజుల్లో కరువు ఏర్పడితే ప్రజలంతా కలిసికట్టుగా ఉండి వాతావరణ పరిస్థితులను చక్కబెట్టుకోవాలని ఒకరినొకరు అండగా నిలబడాలని జ్యోతిబాపూలే విద్యాలయం ఉపాధ్యాయులు(Jyotiba Phule School Teachers) అన్నారు. సోమవారం బెజ్జూర్ మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిబాపూలే ఇంగ్లీష్ మీడియం విద్యాలయం విద్యార్థులు మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.
నిర్వహించి నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రదర్శన నిర్వహించారు.ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు మారాయని, వాతావరణం లో మార్పులు జరిగాయని దీనివల్ల పంటలు నష్టపోయే అవకాశం ఉందని దీంతో కరువు పరిస్థితులు ఏర్పడే ప్రభావం ఉందని తెలిపారు.
ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి నీటిని పొదుపుగా వాడుకోవాలని, మొక్కలను నాటాలని, భూగర్భ జలాలను పెంచుకోవాలని, కరెంట్ ని,అన్నాన్ని వృధా చేయొద్దని, కరువు పరిస్థితులను ప్రదర్శనలు ద్వారా ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భూమి, సూర్యుడు, వృక్షం, సీతాకోకచిలుక, వంటి ప్రదర్శనలతో మండల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జ్యోతిబాపూలే విద్యాలయం కరస్పాండెంట్ ఓంప్రకాష్, శ్రీనివాస్, వసంత్, సిబ్బంది కావిడి సురేష్, ఉపాధ్యాయులు, తాజుద్దీన్,రంగయ్య తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు .