పట్టభద్రుల ఓటరు నమోదుకు హెల్ప్‌డెస్క్
అర్హులు సేవలను వినియోగించుకోవాలి
వెంకటాపూర్, నవంబర్ 02 (విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో(MLC Electoral Roll) పేర్ల నమోదుకు అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం కోసం హెల్ప్‌డెస్క్ సేవలను వినియోగించుకోవాలని తహసిల్దార్ గిరిబాబు(Tahsildar Giribabu) సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితా తయారీకి సంబంధించి ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు పట్టభద్రులకు ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు, ఓటరు నమోదు దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు, ఓటర్ల జాబితాకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోవచ్చని, అర్హులైన పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ ప్రసాద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్, సీనియర్ అసిస్టెంట్ రవీందర్, జూనియర్ అసిస్టెంట్ సర్జన్, జీపీవోలు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.