ఉద్యమాల విద్యార్థిని గెలిపించాలి
టీ.జే.ఎస్. పార్టీ జిల్లా అధ్యక్షుడు మొసలి శ్యాంప్రసాద్ రెడ్డి
బిజినేపల్లి: విద్యార్థి ఉద్యమాల(Student movements) నుంచి వచ్చినటువంటి రామ్మోహన్ రెడ్డి(Sama Rammohan Reddy)కి కాంగ్రెస్ పార్టీ పట్టాభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే వారి తరుపున నిరంతరం పోరాడి, వాటి పరిష్కారానికి కృషి చేస్తాడని, అలాంటి వ్యక్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మొసలి శ్యాంప్రసాద్ రెడ్డి కోరారు. రాబోయే పట్టాభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయనున్న సామ రామ్మోహన్ రెడ్డిని తెలంగాణ జన సమితి పార్టీ(Telangana Jana Samithi Party) జిల్లా అధ్యక్షులు మొసలి శ్యాంప్రసాద్ రెడ్డి గురువారం గాంధీభవనులో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యువతకు అవకాశం ఇవ్వడం మంచి నిర్ణయమని, నిరుద్యోగుల తరపున, ఉపాధ్యాయుల తరపున, ఉద్యోగస్తుల తరపున పోరాడిన అనుభవం సామ రామ్మోహన్ రెడ్డికి ఉందన్నారు. కూటమిలో భాగంగా పార్టీలో చర్చించిన తర్వాత రామ్మోహన్ రెడ్డికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియ చేస్తుందని ఆయన గెలుపు నల్లేరు మీద నడికేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.