కాంగ్రెస్ సభకు చిట్యాల మండల నాయకులు
చిట్యాల, నవంబర్ 01 (విజయక్రాంతి): దేశ రాజధాని ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిర్వహిస్తున్న ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ భారీ బహిరంగ సభకు నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు(Congress Leaders), కార్యకర్తలు తరలివెళ్లారు. ఆదివారం ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, గుత్తా అమిత్ రెడ్డి నకిరేకల్ నియోజకవర్గ బృందంతో కలిసి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ రాహుల్ గాంధీ పిలుపు మేరకు దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ సభలో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమంలో నకిరేకల్ నియోజకవర్గ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు దుబ్బాక అమరేందర్ రెడ్డి, గుడిపాటి లక్ష్మీనరసింహ, జనగాం రవీందర్ గౌడ్, కాటం వెంకటేశం, ఎద్దులపురి కృష్ణ, జడల చిన్న మల్లయ్య, ఏనుగు రఘుమారెడ్డి, పల్లపు బుద్ధుడు, బోడ స్వామి, దేశపాక రాజేష్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.