వెలిమినేడు కాంగ్రెస్ నూతన కమిటీకి ఘన సన్మానం

08-10-2026 | 08:37pm

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం(Chityala Mandal) వెలిమినేడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ(Congress Party) నూతన గ్రామ శాఖ కమిటీ సభ్యులను కాంగ్రెస్ యూత్ నాయకుడు, 9వ వార్డు నాయకుడు గుండ్లపెళ్లి సైదులు గురువారం  శాలువాలతో సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నూతన గ్రామ శాఖ అధ్యక్షుడిగా అంశల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా కర్దూరి అంజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పగిళ్ల యాదయ్య, ఉపాధ్యక్షుడిగా ఎండీ కాజా బాషా, కార్యదర్శిగా గోలి నరేష్ రజక, కార్యవర్గ సభ్యులుగా ఆరూరి నరసింహ, అంశల శ్రవణ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ నూతన పాలకవర్గం సమన్వయంతో పనిచేస్తూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీఏసీఎస్ చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి హాజరయ్యారు. పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు