శివనేనిగూడెంలో ఘనంగా గణపతి ఉత్సవాలు
చిట్యాల, సెప్టెంబర్ 21(విజయ క్రాంతి ): చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు శివనేనిగూడెంలో(Shivanenigudem) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్(Dr. B.R. Ambedkar) ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి (Nagam Varshith Reddy)ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నకరికంటి మొగులయ్య, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్ కుమార్ యాదవ్, నాయకులు కన్నెబోయిన మహలింగం యాదవ్, వనం అంజయ్య, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ శివనేనిగూడెం ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని గణనాథుడిని కోరుకున్నట్లు తెలిపారు.