గ్రామాభివృద్ధిపై సర్పంచ్ ప్రత్యేక దృష్టి

10-10-2026 | 06:43pm

మల్లాపూర్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. గ్రామంలోని మూడో వార్డు నుంచి గంగమ్మ గుడి వరకు, బతుకమ్మ ఘాట్ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన సర్పంచ్ గోల్కొండ కళా–రమేష్, ఉపసర్పంచ్ దండవేణి రాజేందర్, వార్డు సభ్యుల సమన్వయంతో నూతన విద్యుత్ స్తంభాలు, వీధి దీపాల ఏర్పాటు పనులు చేపట్టారు (Street Lighting).

ఈ సందర్భంగా మూడో వార్డు సభ్యుడు జంగా ప్రణయ్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల సహకారంతో ముందుకు సాగుతామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అభివృద్ధి కార్యక్రమాలను (Infrastructure Development) కొనసాగిస్తామని పేర్కొన్నారు.


మరిన్ని వార్తలు