రెండు ప్రభుత్వాలూ విఫలం
- రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిందేమీ లేదు
- టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
- కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ
కోస్గి, సెప్టెంబర్ 20: రాష్ట్ర ప్రజలకు మంచి చేయడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్(BRS, Congress) రెండు ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని తెలంగాణ రక్షణ సేన(Telangana Protection Force) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) అన్నారు. కొడంగల్ నియోజకవర్గం(Kodangal Constituency) కోస్గిలో ఆదివారం తెలంగాణ రక్షణ సేన నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో ఆమె మాట్లాడారు. భవిష్యత్తులో టీఆర్ఎస్ నేతృత్వంలో తెలంగాణలో బహుజన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తానన్న విశ్వా సం తనకు ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రెండు ప్రధాన ప్రభుత్వాలు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం(BJP government) అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదని విమర్శించారు. తెలంగాణ వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఎంతో కష్టపడి చదివించినా యువ తకు ఉద్యోగాలు లేకుండా పోయాయన్నారు. సామాజిక న్యాయం కోసం పాంచజన్యాన్ని పూరిస్తున్నామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా ఏ వ్యవస్థలో చదువుతున్న విద్యార్థులైనా వారి చదువుల ఖర్చులను ప్రభుత్వం భరించేలా చర్యలు తీసుకుంటామని కవిత హామీ ఇచ్చారు.
పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.3,600 కాస్మెటిక్ చార్జీలు చెల్లించాల్సి ఉన్నా ప్రభుత్వం వాటిని కూడా చెల్లించడం లేదని ఆరోపించారు. యువత మొత్తం అఫ్గానిస్థాన్, ఇరాన్లో పని చేసుకోవాలని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని విమర్శించారు. విద్యా విధానంలో మార్పు రావాలని, ప్రతి గ్రామంలో బడి, ప్రతి తరగతికి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేటి ప్రభుత్వాలు వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు.
ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ అనే తేడా లేకుండా అన్ని ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు ఉంటే అందులో లక్షల కోట్ల రూపాయలను విద్య, వైద్య రంగాలకు కేటాయిస్తామని తెలిపారు. పరిశ్రమలు, వ్యాపారాలు స్థాపించుకోవాలనుకునే వారికి రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు ప్రభుత్వం ద్వారా రుణాలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
స్వతహాగా తాను రైతుబిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి హయాంలో యూరియా లేదని, కరెంటు లేదని, రైతు భరోసా, రైతు బీమా లేదని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కృష్ణా నది నుంచి వికారాబాద్ వరకు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. సామాజిక అన్యాయం వైపు ప్రభుత్వం ప్రయాణిస్తే బలమైన సర్పం కూడా చలి చీమల చేత చిక్కి చచ్చినట్లుగా బహుజన వర్గాల ఆగ్రహానికి బలవక తప్పదని కవిత వ్యాఖ్యానించారు.
మహిళలను మహారాణులుగా కీర్తించే రాజకీయ పార్టీలు వారికి రాజకీయ అవకాశాలు కల్పించేందుకు మాత్రం ముందుకు రావడం లేదని కవిత విమర్శించారు. జిల్లాలో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే ఇసుక దందా, మట్టి దందా, ఇందిరమ్మ ఇళ్ల దందా తప్ప అభివృద్ధి పనులు చేయడం లేదని విమర్శించారు. యువతకు, మహిళలకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.