కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసన

07-09-2026 | 11:51pm

మద్దూర్,(విజయక్రాంతి): కాంగ్రెస్‌ ప్రభుత్వ(Congress government) 1000 రోజుల పాలనకు నిరసనగా బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మద్దూర్‌లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి(Former MLA Patnam Narender Reddy) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్ కాంగ్రెస్‌ హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. 6 గ్యారంటీలు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వంచర్ల గోపాల్, సంగీత శివకుమార్, కళ్ళపు దినేష్, మున్కంపల్లి నరసింహ, మౌలానా, గోపాల్, కొంతం విట్టల్, మోనేష్ చారి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు