ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాల ఘటాల నిమజ్జనం

21-10-2026 | 07:59pm

మద్దూరు: మద్దూరు మున్సిపాలిటీ(Maddur Municipality) పరిధిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గత తొమ్మిది రోజులుగా భక్తులు తమ తమ ఇళ్లలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, చివరి రోజున అమ్మవారి ఘటాలను నిడ్జింత రోడ్డులోని కాసు వాగులో నిమజ్జనం చేశారు.

ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తి భావంతో ఘటాల నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మద్దూరు మున్సిపల్ చైర్‌పర్సన్ సరస్వతి, జనార్ధన్, అమర్నాథ్, సత్యనారాయణ, నర్సింగ్ రావు, బాలాజీ, గోవర్ధన్, నగేష్, శ్రీధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు