వైభవంగా విజయదశమి సంబరాలు

21-10-2026 | 08:03pm

* రావణ దహనాన్ని ఆసక్తిగా తిలకించిన ప్రజలు..

ఆదిలాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్(Adilabad) లో నిర్వహించిన వేడుకలు వైభవంగా సాగాయి. సనాతన హిందూ ఉత్సవ సమితి(Sanatana Hindu Utsava Samiti) ఆధ్వర్యంలో డైట్ మైదానం వేడుకలను నిర్వహించారు. ఉత్సవాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి వేడుకలను రావణుడి దహన కార్యక్రమాన్ని(cremation ceremony of Ravana) ఆకస్తిగా తిలకించారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ కంది శ్రీనివాస్ రెడ్డి(Kandi Srinivas Reddy) దంపతులు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.

ముందుగా దుర్గామాత చిత్ర పటానికి, జమ్మి చెట్టుకు అతిథులు పూజలు నిర్వహించారు. అనంతరం రావణ దహనం చేశారు. ఈ సందర్భంగా వివిధ గణేష్ మండపాల నిర్వాహకులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 

 ఈ కార్యక్రమంలో సనాతన హిందూ ఉత్సవ సమితి అద్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి, డీఎస్పీ జీవన్ రెడ్డి, సభ్యులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు