ఆ పల్లెలు కంపు కొడుతున్నాయ్!

06-10-2026 | 05:25am
  1. సీసీ రోడ్లే డ్రైనేజీ కాలువలా?
  2. ఖాళీ ప్లాట్లే ఇంకుడు గుంతలు అయితే ఎట్లా
  3. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ రోగాల పాలవుతున్న జనం 

మాగనూర్, అక్టోబర్ 5 : ఆ పల్లెలు కంపు కొడుతున్నాయ్.. సీసీ రోడ్లు(Cement Concrete Roads) వేసిన డ్రైనేజీలు నిర్మాణం(Construction of drains) చేపట్టకపోవడంతో మండల పరిధిలోని పలు గ్రామాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు. పల్లెలు పచ్చని తోరణాల కురుపు దిద్దుకుంటాయని చెబుతున్న ప్రభుత్వం సిసి రోడ్లపైనే మురుగునీరు మారడంతో జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సిసి రోడ్లు వేయి క్రమంలో ఉన్న డ్రైనేజీలను తీసివేయడంతో తిరిగి నిర్మించకపోవడంతో ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయని జనం అసంతృప్తి వ్యక్తం చేస్తుండ్రు. ఏండ్ల తరబడి ఇలాగే ఉండడంతో మురుగునీరుతో కంపు కొడుతున్న ఇల్లు విడిచి ఇంకో ఇంటికి వెళ్లలేక అక్కడే ఉండి జీవనం కొనసాగిస్తున్న ఆయా గ్రామాల ప్రజలు తాము రోగాల బారిన పడుతున్నామని, తమ ఆవేదనను పరిగణలోకి తీసుకొని పరిస్థితిలో చక్కదిద్దాలని కోరుకుంటున్నారు.

ఖాళీ ఫ్లాట్లే డ్రైనేజీ గుంతలా...

 ఇండ్ల మధ్యలో ఎక్కడైనా ఖాళీగా జాగ కనిపిస్తే ఆ జాగాలో పూర్తిగా మురుగునీరు నిలిచి దుర్వాసన వేదజల్లుతుందని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని ఓబులపూర్ గ్రామం తో పాటు పలు గ్రామాలలో ఈ పరిస్థితి ఉందని ప్రజలు చెబుతున్నారు. సర్పంచులు కొలువుతీరినప్పటికీ నిధులు అందుబాటులో లేకపోవడంతో ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయని పలువురు పేర్కొన్నట్లు సమాచారం. ఇప్పటికైనా ప్రత్యేకంగా నిధులు కేటాయించి గ్రామాలలో రోడ్లపై పారుతున్న మురుగునీరుని నిలుపుదల చేసే చర్యలు తీసుకోవాలని ఆ గ్రామాల ప్రజలు వేడుకుంటుండ్రు.

నిధులు వచ్చిన వెంటనే డ్రైనేజీ పనులు...

 కొన్ని గ్రామాలలో ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. ప్రస్తుతం నిధులు అందుబాటులో లేకపోవడంతో డ్రైనేజీ నిర్మాణాల పనులు చేపట్టడం లేదు. నిధులు వచ్చిన వెంటనే ముందు ప్రాథమిక డ్రైనేజీ నిర్మాణ లకు ఇవ్వడం జరుగుతుంది. 

         - ఎంపిడీఓ శ్రీనివాసులు,

మాగనూర్ మండలం,

నారాయణ పేట జిల్లా

మరిన్ని వార్తలు