ప్రజా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన ప్రతిపక్ష నాయకులు

21-09-2026 | 07:27pm

నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపాలిటీ కొత్తపల్లి హామీలు అమలు చేయకుండా ప్రజాపాలన దినోత్సవమా?

కొత్తపల్లి :ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ సోమవారం కోస్గి పట్టణంతో పాటు కొడంగల్ నియోజకవర్గంలోని(Kodangal Constituency) అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించడం బాధాకరమని నాయకులు పేర్కొన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను ముందుగా నెరవేర్చిన తర్వాతే ప్రజాపాలన దినోత్సవాలు నిర్వహించాలని వారు డిమాండ్‌ చేశారు. పలు ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.

ముఖ్యంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయాల కారణంగా పంటలు ఎండిపోయిన రైతులకు పంట నష్టపరిహారం, పంట బీమా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే కొత్తపల్లి మండల కేంద్రంలో ఇళ్లు కోల్పోయే పరిస్థితిలో ఉన్న బాధితులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుతో పాటు రైతులు, పేదలు, బాధితుల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు

మరిన్ని వార్తలు