యూరియా ఉత్పత్తికి కేంద్రం భారీ ప్లాన్

25-11-2026 | 04:35pm

న్యూఢిల్లీ: దేశంలో యూరియా ఉత్పత్తి (Urea Production) సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఆరు కొత్త యూరియా ఉత్పత్తి ప్రాజెక్టులను (Projects) అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

ఈ ఆరు ప్రాజెక్టుల (Fertilizer Plants) అభివృద్ధికి మొత్తం రూ.54,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించింది. దేశీయంగా ఎరువుల తయారీ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు రైతులకు యూరియా లభ్యతను మెరుగుపరచడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.

ప్రస్తుతం యూరియా కోసం విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయ ఉత్పత్తి (Domestic Production) పెంచడంపై కేంద్రం దృష్టి సారించింది. వ్యవసాయ రంగానికి అవసరమైన ఎరువులను నిరంతరంగా అందుబాటులో ఉంచేందుకు ఈ ప్రాజెక్టులు దోహదపడనున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు వ్యవసాయ రంగానికి ఊతమివ్వనుంది.

మరిన్ని వార్తలు