భారత రాజ్యాంగ దినోత్సవం
భైంసా (విజయక్రాంతి): భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం బీజేపీ(BJP) ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ర్యాలీని నిర్వహిస్తున్నట్టు బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు సాదు ప్రభాకర్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. స్థానిక వివేకానంద చౌక్ నుంచి ఉదయం 10 గంటలకు ర్యాలీ ప్రారంభమై అంబేద్కర్ చౌక్ వరకు కొనసాగుతుందని తెలిపారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ నాయకులు, ఎస్సీ మోర్చా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజ్యాంగ దినోత్సవ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు చిన్నారెడ్డి, రవీందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నర్సారెడ్డి, న్యూ వెల్మల్ గ్రామ సర్పంచ్ రాచకొండ సాగర్, జిల్లా మీడియా కన్వీనర్ బుర్ర రమేష్ పాల్గొన్నారు