రసోల్ గ్రామంలో వైద్య శిబిరం

02-10-2026 | 05:40am

టీబీ స్క్రీనింగ్, ఎక్స్‌రే పరీక్షలు

కంగ్టి, అక్టోబర్ 1: క్షేత్రస్థాయిలో వైద్య సేవలు(Medical Services) అందుబాటులో లేకపోవడంపై విజయక్రాంతిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కంగ్టి మండలం(Kangti Mandal) రాసోల్ గ్రామంలో వైద్య బృందం పర్యటించి ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంది. ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి వైద్య పరీక్షలు నిర్వహించారు.

గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో టీబీ వ్యాధి నిర్ధారణకు స్క్రీనింగ్, ఎక్స్రే పరీక్షలు చేపట్టారు. దీర్ఘకాలిక దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్నవారికి అవసరమైన పరీక్షలు చేయించి తదుపరి చికిత్సపై సూచనలు ఇచ్చారు. వైద్య సిబ్బంది వృద్ధులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకున్నారు. విజయక్రాంతి కథనం అధికారుల దృష్టికి వెళ్లడంతో రసోల్ గ్రామంలో వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టడం గమనార్హం. గ్రామంలో వైద్య కార్యక్రమం చేపట్టడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు