యుద్ధభూమి ఢిల్లీ!

10-10-2026 | 05:30am

నేడు సీజేపీ నిరసన నేపథ్యంలో జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ నిలిపివేత

  1. భారీ బందోబస్తు 
  2. 57 మెట్రో స్టేషన్ల మూసివేత
  3. అనుమతి లేకున్నా సీజేపీ నిరసన చట్ట విరుద్ధం
  4. రవాణాపై పూర్తి నిషేధం వద్దు: సుప్రీం

న్యూఢిల్లీ, అక్టోబర్ 9 (విజయక్రాంతి): సీఈసీ జ్ఞానేశ్‌కుమార్(CEC Gyanesh Kumar) రాజీ నామా డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)(Cockroach Janata Party) అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న నిరసనను అడ్డుకునేందుకు కేంద్రం భారీ చర్యలకు ఉపక్రమించింది. జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలను, ఢిల్లీకి దారితీసే సరిహద్దులను, రవాణా సదుపాయాలను తమ ఆధీనంలోకి తీసుకొని, భారీ ఎత్తున కేంద్ర, రాష్ట్ర పోలీసులను భద్రత కోసం వినియోగిస్తుంది.

నిరసనకారులు సున్నిత ప్రాంతాల వైపు వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. 57 మెట్రోస్టేషన్లపై ఆంక్షలు, పలు స్టేషన్ల మూసివేత, నిరసనలకు దారితీసే రోడ్ల మూసివేత, శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి శనివారం రాత్రి 10 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేత వంటి చర్యలను చేపట్టారు.

ఢిల్లీ జంతర్ మంతర్‌కి దారి తీసే అన్ని సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని, ఆన్‌లైన్ మాధ్యమంగా నిర్వహించుకోవాలని అధికారులు యాజమాన్యాలను ఆదేశించారు. పలువురు ప్రజాప్రతినిధులు, నిరసనల్లో పాలు పంచుకోవడానికి వివిధ మార్గాల్లో వస్తున్న వారిని శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

ఇతర ప్రాంతాల నుంచి నిరసనకారులు నగరంలోకి ప్రవేశించకుండా పలు మార్గాలను పూర్తిగా, పాక్షికం గా మూసివేశారు. 221 కంపెనీల కేంద్ర బలగాలు (23వేలమంది) 8 నుంచి 12వ తేదీ వరకు ఢిల్లీలో మోహరించారు. 15వేల మంది ఢిల్లీ పోలీసులు అదనపు భద్రతను నిర్వర్తిస్తున్నారు. నిరసనకారుల ప్రదర్శన వద్ద ఫ్రంట్ లైన్‌లో 150 మంది పోలీసులను బాడీ కెమెరాలతో మోహరించ నున్నారు.

గతంలో జరిగిన నిరసనల్లో అలజడి సృష్టించిన 2800 మందిపై నిఘా పెట్టా రు. కొందరిని బైండోవర్ చేశారు. 57 మెట్రో స్టేషన్లలను మూసివేయనున్నారు. 10వ తేదీ ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జంతర్ మంతర్‌కు దగ్గరలో ఉన్న రెండు రైల్వే స్టేషన్ల నుంచి పూర్తిగా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. 

సీజేపీ నిరసన చట్ట విరుద్ధం: సుప్రీం

ఢిల్లీలో మెట్రో స్టేషన్లు, రైళ్ల సేవలపై ఆంక్షలు విధించడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అదే సమయంలో అనుమతి లేకున్నా నిరసన చేయడం చట్ట విరుద్ధమవుతుందని తెలిపింది. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలకు చోటు ఉన్నా, అధికారులు అనుమతి నిరాకరించినా నిరసన చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది. భద్రతా చర్యలు అవసరమే అయినా ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేయడం సరికాదని స్పష్టం చేసింది.

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై సీపీఐ (ఎం) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. ఇటు కేంద్ర ప్రభుత్వం, అధికారులు, అటు సీజేపీపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

ఢిల్లీ మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్ల మూసివేతపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆంక్షల వల్ల వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వెల్లడించింది. ఢిల్లీకి అన్ని ప్రాంతాల ప్రజలు రోజుకు లక్షలాది మంది రాకపోకలు సాగిస్తుంటారని, ఉద్యోగులు, ఇతర అవసరాల కోసం ప్రయాణించే వారికి ఇబ్బందులు కలగకుండా చూ డాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు.

మరిన్ని వార్తలు