ఢిల్లీలో హై అలర్ట్..రాంలీలా మైదాన్ వద్ద భారీ బందోబస్తు!

01-11-2026 | 11:22am

న్యూఢిల్లీ: ఇండియా కూటమి మెగా ర్యాలీ (Mega Rally) నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాంలీలా మైదాన్ (Ramlila Maidan) పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని ప్రాంతాల్లో నిఘా (Surveillance) ఏర్పాటు చేశారు.

మరోవైపు కాంగ్రెస్ నేతలు, ఇండియా కూటమి నాయకులు, నిరసనకు మద్దతు తెలిపే కార్యకర్తలు ఒక్కొక్కరుగా రాంలీలా మైదాన్‌కు చేరుకుంటున్నారు. 'ఓట్ బచావ్.. దేశ్ బచావ్' నినాదంతో చేపట్టిన ఈ ర్యాలీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా మూడు ప్రధాన డిమాండ్లతో ఇండియా కూటమి చేపట్టిన ఈ ఆందోళనలో నేతలు ఏం మాట్లాడబోతున్నారు? కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై ఎలాంటి విమర్శలు చేయబోతున్నారు? ఈ ర్యాలీకి ఎంతమంది హాజరవుతారు? అనే అంశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

మొత్తంగా ఢిల్లీలోని రాంలీలా మైదాన్ ఇప్పుడు రాజకీయ కేంద్రంగా మారింది. ఈ నిరసన ర్యాలీ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

మరిన్ని వార్తలు