గాల్లోనే కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్

30-10-2026 | 11:57am

బోస్నియా: ఘోర హెలికాప్టర్ ప్రమాదం (Helicopter Crash) చోటుచేసుకుంది. ఇటలీకి చెందిన మిలిటరీ హెలికాప్టర్ (Military Helicopter) గాల్లో ప్రయాణిస్తుండగా అదుపుతప్పి కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో మొత్తం 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

గాల్లో అదుపుతప్పి కుప్పకూలిన హెలికాప్టర్

గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో హెలికాప్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడిపోయింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారాయి. హెలికాప్టర్ కుప్పకూలిన వీడియో కలకలం రేపుతోంది.

ప్రమాదంపై విచారణకు ఆదేశం

ఈ ఘటనపై ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో స్పందించారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు విచారణ (Investigation) చేపట్టినట్లు వెల్లడించారు. హెలికాప్టర్ కూలిపోవడానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఇటలీ సైనిక వర్గాల్లో ఆందోళన నెలకొంది.

మరిన్ని వార్తలు