రాష్ట్రపతి భవన్‌లో నేపాల్ ప్రధానికి ఘన స్వాగతం

23-11-2026 | 10:34am

న్యూఢిల్లీ: నేపాల్ ప్రధాని బాలేంద్ర షాకు భారత్‌లో అధికారిక స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా భారత త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. నవంబర్ 22న ఢిల్లీకి చేరుకున్న బాలేంద్ర షా.. మార్చిలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భారత్‌లో ద్వైపాక్షిక పర్యటనకు వచ్చారు.

ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో కీలక చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఇంధనం, మౌలిక సదుపాయాలు, రైల్వే కనెక్టివిటీ, అభివృద్ధి భాగస్వామ్యం వంటి అంశాలు చర్చకు రానున్నాయి. అలాగే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతోనూ బాలేంద్ర షా సమావేశం కానున్నారు. భారత్, నేపాల్ మధ్య దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని వార్తలు