మట్టి వినాయకుల పంపిణీతో పర్యావరణ పరిరక్షణకు కృషి

13-09-2026 | 12:38pm

ముకరంపుర, సెప్టెంబర్ 13(విజయ క్రాంతి): అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్(Association of Lions Clubs International), డిస్ట్రిక్ట్ 137A ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా సుమారు 70 మందికి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాల వల్ల నీరు, నేల మరియు పర్యావరణానికి కాలుష్యం ఏర్పడుతుందని వివరించారు. పర్యావరణహితమైన మట్టి వినాయకులను ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని, పూజ అనంతరం మట్టి తిరిగి మట్టిలో కలిసిపోయే విధంగా ఉండటం మట్టి వినాయకుల ప్రత్యేకత అని తెలిపారు.

డిస్ట్రిక్ట్ 137A పర్యావరణ పరిరక్షణలో భాగంగా గతంలో గ్రీన్ పోస్టర్ డ్రాయింగ్ పోటీలు, 1,200 మొక్కల నాటడం వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిందని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, డాక్టర్ జి.ఎం. కిరణ్, డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ అశోక్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సౌమ్య, డాక్టర్ సాయి మేఘన, డాక్టర్ సాయి ప్రీతం తదితరులకు మట్టి వినాయక విగ్రహాలను అందజేసి, పర్యావరణ పరిరక్షణలో వాటి ప్రాముఖ్యతను వివరించారు.

మరిన్ని వార్తలు