ఫారం 6పై ఏ తీర్పూ ఇవ్వలేదు
- బీహార్ సర్‌లో కొత్త సవరణలను ఆమోదించలేదు
- ఎన్నికల కమిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- ఫారంలో ఎవరు మార్పులు చేశారో తేలుస్తాం
- రికార్డుల పరిశీలన అనంతరం స్పష్టత ఇస్తాం
- ఈ నెల 27న విచారణ చేస్తాం: దేశ అత్యున్నత ధర్మాసనం
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: ఫారం-6పై తీవ్ర వివాదస్పదం తలెత్తడం, రాజకీయ ప్రకంపనలు(Political shockwaves) జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్త ఫారం 6ను తాము ఆమోదించలేదని లేదా తిరస్కరించలేదని, బీహార్‌లో(Bihar) ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(Special Summary Revision of Electoral Rolls) (సర్)కు సంబంధించిన అంశాన్ని విచారిస్తున్నప్పుడు ఈ విషయంపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఈ సవరణలకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిందని భారత ఎన్నికల సంఘం(Election Commission of India) (ఈసీ) వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మే 27న తాము ఇచ్చిన తీర్పు సమయానికి ఈ కొత్త ఫారం-6 అసలు అమల్లోనే లేదని సీజేఐ సూర్యకాంత్ పేర్కొన్నారు. కొత్త ఫారం-6 డిక్లరేషన్‌కు సుప్రీంకోర్టు ఆమోదం ఉందంటూ ఎన్నికల సంఘం చేసిన వ్యాఖ్యలను న్యాయస్థానం తప్పుబట్టింది. ఫారంలో ఎవరు మార్పులు చేశారో రికార్డులు చూసి తేలుస్తామని స్పష్టం చేసింది. ఫారం 6 అనేది ఓటర్ల జాబితాలో తమ పేరును చేర్చాలని కోరుతూ అర్హులైన వ్యక్తులు సమర్పించే దరఖాస్తు.
అయితే సర్‌కి సంబంధించిన పిటిషన్‌ను విచారిస్తున్న జస్టిస్ సూర్యకాంత్(Justice Surya Kant), జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వీ మోహనతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కొత్త ఫారం 6ను అత్యున్నత న్యాయస్థానం ఆమోదించిందని ఎన్నికల సంఘం పేర్కొన్నట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. వివిధ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సర్ ప్రక్రియలో ఎన్నికల సంఘం ఉపయోగిస్తున్న ఫారం 6లో ఎటువంటి మార్పులకూ తాము ఆమోదం తెలపలేదని అత్యున్నత న్యాయస్థానం ఈ నెల 5న పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
‘కొత్త ఫారం 6పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మేము చెప్పింది అంతే’ అని జస్టిస్ బాగ్చీ పేర్కొన్నారు. బీహార్ సర్ వ్యవహారంపై విచారణ జరిగినప్పుడు కొత్త ఫారం 6 అంశం అప్పుడు లేదని ఆయన తెలిపారు. దీని అర్థం అత్యున్నత న్యాయస్థానం దానిని ఆమోదించిందని లేదా తిరస్కరించిందని కాదని ఆయన స్పష్టం చేశారు. మే 27న తాము ఇచ్చిన తీర్పు సమయానికి ఈ కొత్త ఫారం-6 అసలు అమల్లోనే లేదని, అలాంటప్పుడు దాన్ని ఆమోదించామని ఎలా చెబుతారని ధర్మాసనం నిలదీసింది.
ఫారం-6 సవరణలను తాము ఆమోదించలేదని తెలిపింది. ఫారంలో ఎవరు మార్పులు చేశారో రికార్డులు చూసి తేలుస్తామని చెప్పింది. రికార్డుల పరిశీలన అనంతరం ఫారం-6 మార్పులపై స్పష్టత ఇస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. సర్‌కి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఇతర పిటిషన్‌లతో కలిపి ఈ పిటిషన్‌ను కూడా విచారిస్తామని, ఆ విచారణ ఈ నెల 27న జరగనుందని ధర్మాసనం తెలిపింది.