యెమెన్ అధ్యక్ష భవనంపై హౌతీల దాడులు
తృటిలో తప్పించుకున్న ప్రధాని, ఉన్నతాధికారులు
బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం
సనా, అక్టోబర్ 15: యెమెన్(Yemen) ఏడెన్లోని అధ్యక్ష భవనంపై బాలిస్టిక్ క్షిపణులతో హౌతీలు విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో ప్రధానమంత్రి షాయా మోహ్సెన్ అల్ జిందానీ(Prime Minister Shaya Mohsen Al Zindani) సహా పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు తృటిలో తప్పించుకున్నారు. నలుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. దాడులు జరిగిన సమయంలో వీరంతా అధ్యక్ష భవనంలో సమావేశం నిర్వహిస్తున్నారు.
గురువారం రాత్రి హౌతీలు అధ్యక్ష భవనంపై క్షిపణులతో దాడికి దిగారు. ఈ దాడులతో అధ్యక్ష భవనం నుంచి భారీ ఎత్తున పొగలు పైకి లేవడం స్థానిక మీడియా దృశ్యాలను ప్రసారం చేసింది. సంకీర్ణ దళాలకు యెమెన్ ప్రభుత్వ రక్షణ దళాలు హౌతీలకు వ్యతిరేకంగా పోరాడుతుండడంతో ఈ పోరాటం మరింత ఉధృతరూపం దాలుస్తుంది. కాగా అధ్యక్ష భవనంపై దాడి సంఘర్షణలను మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.