25 కుటుంబాలు కాంగ్రెస్‌లోకి

05-10-2026 | 03:39pm

తెట్టెలపాడు నుంచి కాంగ్రెస్‌లోకి 25 కుటుంబాలు

మంత్రి పొంగులేటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై చేరిక

తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): తిరుమలాయపాలెం(Thirumalayapalem) మండలం తెట్టెలపాడు గ్రామానికి చెందిన 25 కుటుంబాలు బీఆర్‌ఎస్‌, ఎంఎల్‌, టీడీపీ పార్టీలను వీడి కాంగ్రెస్‌లో చేరాయి. పాలేరు నియోజకవర్గంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరినట్లు వారు తెలిపారు. ఖమ్మంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy) క్యాంప్ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి వారికి కాంగ్రెస్‌ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు పేదల సంక్షేమాన్ని విస్మరించారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా పాలనకు ప్రాధాన్యమిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని అన్నారు. పేదలకు రేషన్‌ కార్డులు, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీతో పాటు రైతులు, మహిళల అభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని తెలిపారు.కాంగ్రెస్‌లో చేరిన ప్రతి కుటుంబానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని దయాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ పాలేరు నియోజకవర్గ చైర్మన్‌ చావా శివరామకృష్ణ, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు కొప్పుల అశోక్‌, మాజీ ఎంపీపీ బోడా మంగీలాల్‌, పార్టీ మండల ఉపాధ్యక్షుడు సామా శ్రీనివాసరెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దూదిమెట్ల వెంకట్‌, నాయకులు పుసులూరి సురేష్‌, మాజీ ఎంపీటీసీ గోళ్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు