తెలంగాణ రక్షణ సేనలోకి 30 మంది మహిళలు, యువకులు

03-10-2026 | 08:14pm

తంగళ్లపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) తంగళ్లపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena) పార్టీలోకి సుమారు 30 మంది మహిళలు, యువకులు చేరారు. జిల్లా మహిళా నాయకురాలు చెరుకుపల్లి శైలజ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.

ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాలు సంకపల్లి సుమలత, సుధాకర్ శర్మ నూతనంగా పార్టీలో చేరిన మహిళలు, యువకులకు స్వాగతం పలికి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వరద సతీష్, రమేష్, షాదుక్తో  పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు